ఏపీ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం తొలి భూ కేటాయింపు చేపట్టింది. ఎంఎస్ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల భూమిని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఉచితంగానే కేటాయించింది
రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ.. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది.. 11 మంది క్లస్టర్ ఇంఛార్జీలకు పదవులు. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి. ఆరుగురికి యూనిట్ ఇంఛార్జీలకు పదవులు. 20 కార్పొరేషన్లకు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషనుకు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం.
తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరు కూడా జనసేనకి, టీడీపీలోకి చేరుకుంటున్నారు.. మీరు ఏకాకి గా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాసరావు..
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాలకులు గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూస్తూ కూర్చున్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల నిధులు కేటాయించి.. గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నేతలు చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. వివిధ నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్.. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రధాన్యత కల్పించింది ప్రభుత్వం..…
తిరుమల లడ్డూ వివాద ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలని కోరారు సీపీఐ నారాయణ.. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చిందన్న ఆయన.. కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు.. అయితే, భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి.. జగన్ రివర్స్ టెండర్లు పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం కలిగింది.. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు..? తక్కువ రేటుకు నెయ్యి…