నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమం.. కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ..
నేడు పులివెందులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాక.. ఉదయం 9:30 గంటలకు పార్నపల్లేకు చేరుకొని ప్రజలతో భేటీ.. ఆ తర్వాత పులివెందుల బీజేపీ నాయకులు శశిభూషణ్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న మంత్రి.
నేడు రాజమండ్రిలో ఆదిత్య తక్ష ఇంటర్నేషనల్ స్కూల్ నందు నూతన స్కూల్ క్యాంపస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్
నేడు పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పాల్గొంటారు.
నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పర్యటన.. టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో భేటీ.
నేటి నుంచి తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం.. రెండు బృందాలుగా ఏర్పడిన సిట్.. ఏకకాలంలో తిరుమల, తిరుపతిలో దర్యాప్తు..
నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్..