ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..
నంద్యాల జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. తండ్రి బతికుండగానే చనిపోయాడని కుమారుడు లోకేష్ ఆస్తిని అమ్మేశాడు. తండ్రి బ్రతికి ఉన్నాడంటూ తండ్రితో కలసి పెద్ద కుమారుడు రామకృష్ణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ బాబాయ్, అబ్బాయ్‌కి పొలిటికల్‌గా చుక్కలు కనిపిస్తున్నాయా? వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాల్లా ఏలిన ఇద్దరికీ ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా? వీళ్ళిద్దరి విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? గతం వదల బొమ్మాళీ... అంటున్న ఆ బాబాయ్, అబ్బాయ్ ఎవరు? ఏంటి వాళ్ళ కథ?
బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య పొలిటికల్ అడుగులు తడబడుతున్నాయా? లేక తడబాటును సరి చేసుకుంటున్నారా? రాజకీయ రంగుల కంటే ఉద్యమ పంథానే బెటరని అనుకుంటున్నారా? లేక కొత్త పార్టీ గడప తొక్కబోతున్నారా? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక కృష్ణయ్య వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఐజీ పీఅండ్ ఎల్గా ఎం రవి ప్రకాశ్ బదిలీ అయ్యారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞాపన పత్రం అందచేశారు.
కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సుతిమెత్తని హెచ్చరిక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సామాన్యుల కంటే పదవులు పొందిన వారు ప్రత్యేకం కాదనే స్పృహతో పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల విషయంలో కామెంట్లు చేసిన వారికి సీఎం క్లాస్ తీసుకున్నారు.
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కీలక సదస్సుతో మౌలిక వసతుల రంగంలో వృద్ధి, నూతన పెట్టుబడుల అన్వేషణకు, పెట్టుబడుల్లో భాగస్వామ్యానికి మంచి అవకాశం లభించినట్లైందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి అన్నారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.