AP CM Chandrababu: సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ యాజమాన్యం భేటీ
- సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ ఛైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ
- రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి
- వైజాగ్..విజయవాడ..తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి పోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది.
Read Also: Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ఆ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లులు గ్రూప్ చైర్మన్ తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సిఎం అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ ఛైర్మన్‌తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.
I’m pleased to welcome the Chairman & MD of Lulu Group International, Mr @Yusuffali_MA, and the Executive Director, Mr Ashraf Ali MA, back to Andhra Pradesh. I had a very productive meeting with their delegation in Amaravati today. We discussed plans for a Mall and multiplex in… pic.twitter.com/itk1RuUIHX
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2024
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?