* ఢిల్లీ: నేడు సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై విచారణ.. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రమణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్‌లు.. లడ్డూ వివాదంపై ఉన్న అన్ని పిటిషన్లను ఒకే కేసుకు ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు..
* అల్లూరి ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత.. పాడేరులో 20, మినుములూరులో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.. అల్లూరి ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న పొగ మంచు
* హైదరాబాద్: సచివాలయంలో ఉదయం 11 గంటలకు డీఎస్సీ 2024 ఫలితాల విడుదల చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లపై సమీక్ష సమావేశం..
* నేడు తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ.. పరీక్షలు రాసిన 2.45 లక్షల మంది అభ్యర్థులు.
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాదన సేవలు రద్దు చేసిన టీటీడీ.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు.. రేపు మధ్యహ్నం నుంచి ప్రారంభం కానున్న సర్వదర్శనం
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రి రాక.. ప్రకాష్ నగర్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించనున్న భువనేశ్వరి .. ఉచిత మొబైల్ క్లీనిక్ కు సంబంధించిన బస్సును ప్రారంభించనున్న భువనేశ్వరి.. అనంతరం కొంతమూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్న నారా భువనేశ్వరి
* అన్నమయ్య జిల్లా: నేడు రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
*కడప : కడప రిమ్స్ (జి జి హెచ్) ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.. కడప ప్రభుత్వ డెంటల్ కాలేజి అండ్ హాస్పిటల్ నందు మినీ ఆడిటోరియం, సెంట్రల్ ల్యాబ్ లోని ఎక్విప్మెంట్ ను, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నందు క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించనున్న మంత్రి. అనంతరం రిమ్స్ ఆసుపత్రి ని సందర్శించనున్న సత్యకుమార్.
* శ్రీ సత్యసాయి : మడకశిరలో నేడు టీవడీపీ నియోజకవర్గ స్థాయి విస్త్రతస్థాయి సమావేశం
* అనంతపురం : రెవెన్యూ డివిజన్ స్థాయి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం..పాల్గొననున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.
* తిరుమల: క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,066 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,044 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు
* నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యట.. ఉదయం 10.30 మనకొండూరు అంగన్వాడి కేంద్రంలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీతక్క ,పొన్నం ప్రభాకర్.. లబ్ధిదారులతో ముఖాముఖి.. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ ఎల్ఎండీ కాలని లో కరీంనగర్ జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ శాఖ.. అధికారులతో మహిళా శిశు సంక్షేమ శాఖ పై సీతక్క ,పొన్నం ప్రభాకర్ ల సమీక్ష సమావేశం
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖల పర్యటన.. సంగారెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రులు
* కర్నూలు: హోళగుంద మండలం ఎల్లార్తిలో హజరత్ షేక్ షావలి, హజరత్ షాషావలి 362వ గంధం, ఉరుసు.. భారీ ఎత్తున పాల్లొననున్న భక్తులు.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
* గుంటూరు: నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో, తత్వవేత్త, కొత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాలు.. రెండు రోజులపాటు జాతీయ స్థాయి సదస్సు నిర్వహణ, పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు మంత్రులు…
* హైదరాబాద్: నేడు సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ లతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం.. ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చ.. విధిగా హాజరుకావాలని పీసీసీ ఆదేశం
* గుంటూరు: నేడు ఉండవల్లిలో 37వ రోజు ప్రజాదర్బార్.. మంత్రి నారా లోకేష్ నివాసంలో ప్రజాదర్బార్ నిర్వాహణ