వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏ నేతలు .. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.. గత కొంత కాలంగా జరుగుతున్న తిరుమల వివాదం తెలిసిందే.. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు.. కల్తీ నెయ్యి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించడం శుభపరిణామంగా పేర్కొన్నారు.
కొత్త ఐటీ పాలసీపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్.. అందులో భాగంగా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రొత్సహాకాలు ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది..
ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి..
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టీటీడీ ఆలయ అధికారులు అందజేశారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అందించారు. తిరుమల ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని... నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే.. గత ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు.