Gadikota Srikanth Reddy: గత ప్రభుత్వంలో 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కల్పించింది.. కానీ, నేటి ప్రభుత్వంలో ఊరికో మద్యం షాపు అంటూ ఫైర్ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాలు లేవు… ఒక్క ఉద్యోగ కల్పన లేదు, వున్న ఉద్యోగస్తులను తొలగిస్తుంది నేటి ప్రభుత్వం అని దుయ్యబట్టారు.. గత ప్రభుత్వంలో గాంధీ జయంతికి సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యానికి పునాది అయ్యిందన్నారు.. నేటి ప్రభుత్వంలో ఊరికో మద్యం షాపు.. ప్రస్తుత ప్రభుత్వం సచివాలయ, వాలంటరీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
Read Also: Harish Rao: అందరికి రుణమాఫీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం..
త్రేతాయుగం నుంచి సనాతన ధర్మం నడుస్తోంది.. నేడు సనాతన ధర్మాన్ని తానే కనిపెట్టినట్లు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.. సనాతన ధర్మం గురించి ఎవరు కించపరిచిన దాఖలాలు లేవు.. సనాతన ధర్మం పవన్ కు ఎందుకు గుర్తొచ్చింది..? గతంలో కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టేవారు.. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. అని దుయ్యబట్టారు.. నేడు రాష్ట్రంలో ఒక పక్క అతివృష్టి, మరోపక్క అనావృష్టి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు.. ఖరీఫ్ కు రైతు భరోసా ఇవ్వలేదు.. అనావృష్టితో సతమవుతున్న రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. గత ప్రభుత్వం కడప కొప్పర్తికి MSME ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చింది.. నేడు ప్రభుత్వం MSME ను, రాయలసీమలో లా యూనివర్సిటీని శ్రీబాగ్ వడంబడిక ప్రకారం ఉండాల్సిన హైకోర్టును ఇక్కడ లేకుండా తరలిస్తున్నారు.. రాయలసీమను అన్ని విధాల నిర్లక్ష్యం చేస్తున్నారు.. రాజకీయ నాయకులకు ఎవరి ప్రాంతాలపై వారికి మక్కువ ఉంటుంది.. అయినప్పటికీ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు.
Read Also: Metro Rules: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారా..? ఈ రూల్స్ తెలుసుకోండి
ఇక, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఆర్సీని వెంటనే ఇవ్వాలని కోరారు గడికోట.. ఉద్యోగస్తులకు జగన్ ప్రభుత్వం ఐఆర్ ప్రకటించింది.. కానీ, ఉద్యోగస్తులకు, రైతులకు, మహిళలకు, యువతకు గత నాలుగు నెలలుగా చేసింది ఏమీ లేదని విమర్శించారు.. అమ్మ ఒడి లేకపోవడం వల్ల 24 శాతం బడులలో హాజరు సంఖ్య పడిపోయింది.. పోలవరం విషయంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తే చంద్రబాబు ఎంత నిర్లక్ష్యం చేశారో తెలుస్తోంది.. స్పిల్ వే పూర్తి చేయకుండానే మెయిన్ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల 2018 లో వరదల్లో కొట్టుకుపోయింది.. సమస్యలు వచ్చినప్పుడు కోసం వాటి పరిష్కారం కోసం చొరవ చూపకుండా సున్నితమైన అంశాలను తెరపై తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీస్తున్నారు.. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.. ఉచిత ఇసుక అన్నారు.. అది అందక నేడు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. శాంతి భద్రతల విషయంలో నందికొట్కూరు సంఘటన పరిష్కారం కాకమునుపే పుంగనూరులో పసి పాపను దారుణంగా చంపేశారు అంటూ మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి..