CM Chandrababu: ఆదాయార్జన శాఖలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. మధ్యాహ్నం ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు.. జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.. ఇక, జీఎస్టీ క్లైమ్‌ల విషయంలోనూ అధికారులు అలర్ట్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి.. గత ప్రభుత్వంలో ఎక్సైజ్, గనుల వంటి శాఖలను తమ సొంత ఆదాయాలను పెంచుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు చంద్రబాబు.. ప్రజలకు ఇబ్బందుల్లేని పాలసీలతో అమలు చేస్తూనే.. ఆదాయం పెంచేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. ఆదాయార్జన శాఖల్లో ఉన్న లూప్ హోల్స్‌ను సరి చేసుకుంటే మరింత ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read Also: Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో ధరణి పోర్టల్ రద్దు.. త్వరలో కొత్త చట్టం
ఇక, సమీక్షలు, సమావేశాలు ముగిసిన తర్వాత తిరుమల పర్యటనకు బయల్దేరి వెళ్లారు సీఎం చంద్రబాబు.. తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు రోడ్డు మార్గంలో వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లనున్నారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీవారికి ఏపీ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు..