కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు.
నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు.. 5వ లైన్‌పై రైలు నిలిచిపోయింది.. దీంతో.. పట్టాల పైనుంచి పక్కకు ఒరిగాయి చివరి 5 బోగీలు.. అయితే, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..
మూడున్నర ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడసాగించాలన్నా.. మూతపడాలన్న వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి.
ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. ఇక వైఎస్ జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.. ఇక, దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు..
ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టిపెట్టనుంది. లడ్డూ పోటులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి.. లడ్డూ తయారీ నుంచి.. విక్రయాల విక్రయాల వరకు ఉండే ప్రాసెస్‌ను ఇవాళ పరిశీస్తారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా వ్యవహారం మారింది.
దసరా సెలవులు కూడా తోడు కావడంతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది రైల్వేశాఖ. పర్యాటకుల రద్దీని క్యాష్ చేసుకునే విధంగా.. ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది.. ఈనెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అరకుకు ప్రత్యేక రైలు నడపనుంది రైల్వే శాఖ. దసరా సీజన్ సందర్భంగా పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొంది.