ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కీల కేసులపై దర్యాప్తు చేపట్టింది.. అయితే, ఆ దర్యాప్తులో ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి? అంటూ ఆరా తీశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన మధ్యే ప్రధాన పోటీ జరుగుతుండడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది..
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో రోజురోజుకీ టమోటా ధర పెరుగుతోంది.. కిలో టమోటా రూ. 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది.. జత బాక్స్ 2000 నుండి 2500 పలుకుతుండడంతో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతుల ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.. ఇక, టమోటా ధర మంచి ధర పలుకుటుండడంతో అప్పుల బారి నుండి బయట పడుతున్నామని టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. నేను తెలుగులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.. తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లీషులో మాట్లాడటం ఎందుకో నాకు అర్ధం కాదన్నారు.. మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని హెచ్చరించారు.
రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్న ఆమె.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి..
ఏలూరులో కాల్ మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్న బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు.