CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మానవత్వం చాటుకున్నారు. తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా ఆయన అందించారు. అయితే, వివరాల్లోకి వెళ్తే.. రేణిగుంటకు చెందిన పసుపులేటి సురేంద్రబాబు(30) మానసిక దివ్యాంగుడిగా జన్మించారు. దీనికి తోడు ఇటీవల లివర్ కేన్సర్ రావడంతో.. చంద్రబాబు అంటే సురేంద్ర బాబుకు చిన్నతనం నుంచే అంతులేని అభిమానం, అమితమైన ప్రేమ.
Read Also: Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. “వెయిటర్” ఉద్యోగం కోసం బారులు..
ఇక, తాను ఎంతో ఇష్టపడే నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చనిపోయే లోపు ఒక్కసారైనా ఫోటో దిగాలన్నది సురేంద్ర బాబు కోరిక. ఈ విషయం చంద్రబాబుకు తెలిసింది. దీంతో తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టుకు పిలిపించుకుని సురేంద్ర బాబుతో ప్రత్యేకంగా మాట్లాడి ఫోటో దిగారు. క్యాన్సర్ తో బాధపడుతున్నందున వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందించారు. భయపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని సురేంద్రబాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. తన అభిమాన నేత ఆప్యాయతతో పలకరించడంతో సురేంద్రబాబు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.