గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన చీటింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు... ఇప్పటికే ఈ వ్యవహారంలో కోల్డ్ స్టోరేజ్ కు చెందిన నాగిరెడ్డి, రామచంద్ర రావు, వెంకటేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగి.. కోల్డ్ స్టోరేజ్ రికార్డులను పరిశీలించారు...
Central Government: భారతదేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,858.60 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు విడుదల చేసింది.
మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు మూతపడ్డాయి.. నిన్నటితో వైన్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తి అయ్యింది.. అయితే, మరో 10 రోజులు వైన్ షాపులు తెరవాలని కోరింది ఏపీ ప్రభుత్వం.. కానీ, పది రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని, ప్రైవేట్ వైన్ షాప్స్ వస్తాయి కాబట్టి.. ఇవాళ నుంచి విధుల్లోకి రాలేదు సిబ్బంది..
ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్కు సిట్ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు..
కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.