గుంటూరు కలెక్టరేట్లో కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
తిరుమలలోని దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి ఫోటో షూట్ చేశారు. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫోటోషూట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్లో మాధురి యాక్షన్ చేశారు.
కొత్త ఇసుక విధానంలో లోపాలున్నాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరత, ధరలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఇబ్బందులన దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. ఉచిత ఇసుక అన్నప్పుడు సీవరేజ్ టాక్స్ అవసరం ఉండదన్నారు.
రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన 7071 కి.మీ రహదారులకు సంబంధించిన 1393 రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చేందుకు రూ.290 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గోరంట్లకు చెందిన షేక్ నసీమా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ మహిళ జీజీహెచ్‌కు చేరుకుని.. బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి పరారైంది.
బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బృందానికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుడమేరు వరదలపై నివేదిక తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విధులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం.
కర్నూలు జిల్లాలో ఓ వింత పందెం వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసింది. బతికి ఉన్న చేపను మింగాలని సరదాగా స్నేహితులు వేసుకున్న పందెంతో ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. బతికున్న చేపను మింగి వెంకటస్వామి అనే వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
చదివింది తొమ్మిదో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివితేటలు చూపించి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడొక నిత్య పెళ్ళికొడుకు. ఇస్రోలో హెచ్ఆర్ ఉద్యోగం అని చెబుతూ.. వందల ఎకరాల పొలాలు, విల్లాలు ఉన్నాయని ... పెళ్లికూతుళ్ల కుటుంబ సభ్యులకు ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చి లక్షలకు లక్షలు దోచేస్తున్న ఆ ప్రబుద్ధుడి ఆట కట్టించారు ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు
కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4.45గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు.