ICICI Bank Scam Case: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్ కలకలం రేపుతోంది.. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకల జరిగినట్టుగా తెలుసత్ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.. చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు.. అక్రమాలకు పాల్పడిన ఖాతాదారుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.. ఈ సమయంలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు..
Read Also: Heavy Rains: తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు
ఆ సెల్ఫీ వీడియోలో కీలక అంశాలు చెప్పుకొచ్చారు నరేష్ చంద్రశేఖర్.. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని వీడియో విడుదల చేసిన ఆయన.. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, తనను ఒక్కడినే తప్పుపడుతున్నారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఖాతాదారులను మోసం చేసే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.. బంగారు రుణాలకు సంబంధించిన కొంతమంది పేర్లు మార్చామని ,మోసం చేయలేదని వీడియోలో వెల్లడించారు. ఉన్నతాధికారులు తనను వేధించారని, అనేక మందికి జరిగిన తప్పుల్లో భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు నరేష్ చంద్రశేఖర్.. నరసరావుపేటలోని కరుణాకర్, చిలకలూరిపేటలోని హరీష్ కు ఈ స్కాం మొత్తం తెలుసని సంచలన విషయాలు వెల్లడించారు.. గతంలో అధికారులు ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని భార్యా బిడ్డలను చూసి ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నానని వీడియోలో చెప్పుకొచ్చారు.. తనకు బతకాలని లేదని, చనిపోదామనుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు కీలక సూత్రధారి, బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్..