వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం అన్నారు.. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారు.. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించ లేక పోతున్నారు.. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటినట్లు తెలుస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఐదవరోజైన ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడసేవ జరగనుంది. గరుడ వాహనంపై మలయప్ప దర్శనం సర్వ పాపహరణం గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాల, పచ్చలహారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిని నకిలీ సీబీఐ అధికారులు బెంబేలెత్తించారు. ముంబైలోని సీబీఐ అధికారులుగా చెబుతూ 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదివరకే వాకాటిపై సీబీఐ కేసులు ఉండటంతో ఆయనకు కొంత అవగాహన ఉంది. దీంతో ఆయన గట్టిగా సమాధానం చెప్పినప్పటికీ.. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణమైన ఘటన జరిగింది.. ఇందిరానగర్ లో మైనర్ బాలికకు మద్యం పట్టించి.. ఆపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.. నిందితుడిగా పేర్కొంటున్న మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.
మేం ఆడుతాం అని వీళ్లు! మిమ్మల్ని ఆడనివ్వం వాళ్లు! పర్మిషన్ ఉందని వీళ్లు! అయినా సరే ఆటలు సాగనివ్వం అని వాళ్లు! అధికారపార్టీనే అడ్డుకుంటారా అని వాళ్లు! ఎవరైతే నాకేంటి అని వీళ్లు! ఇదీ అక్కడి క్లబ్బుల్లో జరుగుతున్న వార్! ఇంకా క్లారిటీ కావాలంటే.. ఛలో కొవ్వూరు!
గుంటూరు కలెక్టరేట్లో కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.