సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు.. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..
కర్నూలు జిల్లా దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ద్వారా స్వీకరించింది. అయితే.. నేటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి సుమారు 85 వేలకి పైగా దరఖాస్తులు వచ్చాయి
కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేమిమాను కస్టడీలో తీసుకున్న భీమిలీ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. జమీమాతో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీపీ.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరగనున్న గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరానికి తాగునీటిని అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
ప్రజలు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అందజేశారు. 41వ రోజు “ప్రజదర్బార్” లో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుఉ పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్.. గత ప్రభుత్వ హయాంలో తరిమేసిన అన్ని పరిశ్రమలను మళ్లీ తీసుకొస్తాం అన్నారు.. టీసీఎస్‌ను తామే ఏపీకి తీసుకొచ్చామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్.. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయి అన్నారు..