ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీ ద్వారా కేటాయిస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే 17 వందల 97 కోట్ల 64 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5 వేల 825 అప్లికేషన్స్ వచ్చాయి
ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
త్వరలో వైసీపీ పార్టీని వీడబోతున్నానని రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. ఇప్పటికే వైసీపీ పార్టీ పెద్దలకు ఈ విషయం తెలియజేశానని వెల్లడించారు. తాను జనసేన ఎమ్మెల్యేగా గతంలో ఉంటూ అనివార్య కారణాలవల్ల వైసీపీలో కొనసాగానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతుండగా పక్కకు ఒరిగి చుట్టూ వున్న జనంపై రథం పడిపోయింది.
దేవరగట్టు కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అధికారులు రూపొందించిన ప్రణాళికలు అమలవ్వకపోవడం వల్ల ఈ సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం జరిగి, ఇద్దరు…