ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు కీలక కేసులపై విచారణ జరగనుంది.. తనపై నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని కాకాని వేసిన పిటిషన్ పై విచారణ జరపనున్న హైకోర్టు.. పిన్నెల్లి పిటిషన్లపై.. దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది..
నేడు కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. మొదట డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు సీఎం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. దీపావళి సందర్భంగా దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే కాగా.. ఈ స్కీమ్ కింద గ్యాస్ బుకింగ్స్‌కి భారీ స్పందన వస్తుందు.. అదే స్థాయిలో డెలివరీ చేస్తోంది కూటమి ప్రభుత్వం..
ఈ రోజు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు రానుండటంతో అధికారులు, నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలిస్తారు. ఇ
రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేమ్ ఛేంజర్ అయ్యిందో.. రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం కూడా గేం ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే సరిగ్గా పరిపాలన చేసే వారేమో కానీ ఈవీఎంతో గెలిచారు కాబట్టి పరిస్థితి ఇలా ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి విఫలం అయ్యారని తోటిమంత్రి పవన్ చెప్పాడు కాబట్టి అనిత ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.