శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న వ్యవసాయ, పశుసంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు కోట్ల మందికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గత ఐదేళ్లు ఎవరిని వదలలేదు.. కేసులు పెట్టారు.. ఆస్తుల ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని వైసీపీపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కూడా ప్రజలనుండి అదే ఒత్తిడి ఉంది.. తమ నేత చంద్రబాబు కక్ష్య సాధింపుకి దూరం అని అన్నారు. ఐదు నెలలు ప్రజా స్వామ్యంగా పరిపాలన చేస్తున్నాం.. తప్పు చేసిన వారిని లీగల్‌గా యాక్షన్ తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ కుటుంబంపై ఇష్టానుసారం పోస్ట్ చేస్తున్నారు.. పవన్ తన ఆడపిల్లలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని.. క్యాబినెట్ భేటీలో బాధపడ్డారని అచ్చెన్న వెల్లడించారు
దొంగే దొంగ అన్నట్లుగా జగన్ గొంతు చించుకుని అరుస్తున్నారు.. జగన్ నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని దుయ్యబట్టారు. పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా వదల్లేదని మంత్రి ఆరోపించారు. ఈ రోజు భావ ప్రకటనా స్వేచ్ఛా గుర్తోచ్చిందా.. జగన్ అని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో.. ఆడపిల్లలపై ఇష్టానుసారం పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మనిచ్చిన సొంత తల్లి, చెల్లి మీద సోషల్ మీడియాలో పెడుతున్నావంటూ ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే.. అదే మీకు చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హెచ్చరిస్తున్నా.. మహిళలపై ఏ పార్టీ వారైనా అసహ్య పోస్టులు పెడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
AP High Court: హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
కూటమి అంతా హ్యాపీగా ఉంది.. కలిసే ఉంటున్నాం.. లోపాలు ఉంటే చర్చించుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2027లో అధికారంలోకి వస్తా అంటూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. మరోవైపు.. తాము 21 మందే గెలిచాం.. అధికారం ముఖ్యం కాదని అసెంబ్లీకి వెళ్లాం.. సమస్యలపై పోరాడాం.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్లవా అంటూ ప్రశ్నించారు.
ఎవరడిగితే వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా.. దానికి పద్దతి ఉంది కదా అని అన్నారు. నీవు అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రం, ప్రజల కోసం అసలు పట్టింపు లేదని దుయ్యబట్టారు.