Love Cheating: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి.. మోజు తీరాక..!
- ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన యువకుడు
- యువతిని గర్భవతిని చేసి గర్భస్రావం చేయించిన యువకుడు
- యువతి తల్లిదండ్రులకు తెలిసిన విషయం
- పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో యువకుడు పరారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి తీరా మోజు తీరిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఆ ఘనుడు ముఖం చాటేశాడు. గర్భవతి అని తెలిసి మందుల ద్వారా గర్భస్రావం చేయించాడు. విషయం కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో అసలు బాగోతం బయటపడింది. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో ఆ ఘనుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శ్రీనివాసపురంలో చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన సతీష్ అనే యువకుడు పెళ్లి చేసుకోమని కోరితే ముఖం చాటేస్తున్నాడు.
Read Also: Minister Ram Prasad: ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను జగన్ ఓర్వలేకపోతున్నాడు..
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
కొవ్వూరు శ్రీనివాసపురంలో ఉన్న ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇదే ప్రాంతానికి చెందిన దాసరి సతీష్ అనే యువకుడు ముగ్గులో దింపాడు. ప్రతిరోజు స్కూలుకు వెళుతున్న తమ కుమార్తె వెనుక సతీష్ వెంట పడుతున్నాడని తల్లిదండ్రులు గ్రహించారు. కుమార్తెను మందలించి తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పంపించారు. అక్కడ కూడా ఇద్దరు మధ్యన ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో కామ వాంఛ తీర్చుకున్నాడు. చివరకు గర్భవతిని చేశాడు.
Read Also: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
మెడిసిన్స్ ద్వారా గర్భస్రావం కూడా చేయించాడు. యువతికి అధిక రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు తెలిసి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు తల్లిదండ్రులు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడు సతీష్‌ని పెళ్లి చేసుకోమని అడిగారు. దీంతో.. సతీష్ ముఖం చాటేసాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులు కొవ్వూరు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు పై పోలీసులు సతీష్ పై కేసు నమోదు చేసి బాలిక మైనర్ కావడంతో యువకుడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సతీష్ పరారీలో ఉన్నాడు. ఇతన్ని పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!