నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. రేప్ జరిగింది అన్న విషయాన్ని కప్పిపెట్టడానికి అనేక హాస్పిటల్స్‌కి తిప్పారని ఆరోపించారు.
పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు. సరస్వతి సిమెంట్స్ కోసం భూములను రైతులకు ఇష్టం లేకుండా గత ప్రభుత్వాలు తీసుకున్నాయని మండిపడ్డారు. కేవలం ఫర్నిచర్ వాడుకున్నారని నెపంతో స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తిని వేదనకు గురి చేశారని విమర్శించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీకి గుడ్‌బై చెప్పడంతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..
అనంతపురం పర్యటనలో ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానం అన్నారు డీజీపీ.. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం.. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయబోమని స్పష్టం చేశారు.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నేను కామెంట్ చేయను అంటూ దాటవేశారు.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసు నైనా విచారిస్తాం అన్నారు ఏపీ డీజీపీ..
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అంటూ డ్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ఇదే సమయంలో.. శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కప్పట్రాళ్ల వద్ద యురేనియం కోసం 11 ఎకరాల్లో 68 బోర్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు.. పులివెందుల, ఆళ్లగడ్డలో యురేనియంపై టీడీపీ, సీపీఐ కలసి వ్యతిరేకించాం.. కానీ, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు యురేనియం తవ్వకలుచేస్తే ఎలా? అని ప్రశ్నించారు..
తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు.. ఆయన వయస్సు 99 ఏళ్లు.. ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు రెడ్డి సత్యనారాయణ..