ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్‌కు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన బృందం దాడి చేసింది. ఎలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు.
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024లను శాసనసభ ఆమోదించింది.
ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. నెలల వయసున్న చిన్నారి నుంచి వృద్ధుల వరకు వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా దుర్మార్గులు అకృత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ఆ స్కీంను మాత్రం కొనసాగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకులోకి మళ్లిస్తామని తెలిపింది. శ్రీవారి భక్తులకు రెండు మూడు గంటల సమయంలోనే దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంతమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులేనని.. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి, మరాఠా పరాక్రమానికి చిహ్నంగా, సనాతన ధర్మ రక్షకునిగా నిలుస్తుందన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, నాయకత్వ వారసత్వంతో తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ పుణ్యభూమిని సందర్శించడం గర్వకారణంగా ఉందన్నారు.
రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్దేశ్వరం - అలుగు ప్రాజెక్ట్‌పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..