ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఇక, అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు మంత్రి పొంగూరు నారాయణ..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు..
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి (నవంబర్ 18) 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో…
రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు హాస్పటల్లో వాచ్మెన్ వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో అక్కడి వాచ్మెన్, సిబ్బందే వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేస్తున్నారు. ఇంజెక్షన్లు చేస్తూ మందులు కూడా ఇస్తున్నారు.
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుందన్నారు.