Minister BC Janardhan Reddy: బనగానపల్లె జుర్రేరు వాగు ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి… కాటసాని రామిరెడ్డికి సవాల్ విసిరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాటసాని తన అనుచరుని ఫంక్షన్ హాల్ కోసమే జుర్రేరు వాగు ఆక్రమించి వాకింగ్ ట్రాక్ నిర్మించారని ఆరోపించారు.. అక్రమ నిర్మాణాలన్నీ కచ్చితంగా తొలగిస్తాం, ఆక్రమణదారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ నడి బొడ్డున ఉన్న జుర్రేరు వాగు ఆధునీకరణకు సంబంధించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు, మొదటి విడతలో, రూ 20 లక్షల వ్యయం తో 2.75 కి మీ, మేరకు జుర్రేరు వాగు ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
జుర్రేరు వాగు ఆధునీకరణ పనుల్లో భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భారీ జేసీబీ యంత్రాన్ని నడిపి వాగులోని ముళ్ళ పొదలు తొలగించారు, ఎందుకు సంబంధించి సంబంధిత అధికారులకు మంత్రి పలు ఆదేశాలను సూచనలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ , మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కి సవాల్ విసిరారు.. కాటసాని రామిరెడ్డి గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నానని ప్రజలకు చెప్పి తన అనుచరుడి ఫంక్షన్ హాల్ కు రహదారి నిర్మించాడని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఓట్లు దండు కునేందుకు, కాటసాని రామిరెడ్డి జుర్రేరు వాగులో ఇష్టానుసారం గా అనుచరులతో దురాక్రమణలు చేపించాడని దీంతో వాగు మొత్తం, కుంచించుకొని పోయిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కాటసాని రామిరెడ్డి ప్రోత్సాహంతో గతం లో జుర్రేరు వాగు ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. జుర్రేరు వాగులో అక్రమంగా నిర్మించిన ఇల్లు షెడ్లు అన్ని తొలగిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కాటసాని రామిరెడ్డి తాను జుర్రేరు వాగు ఆక్రమించు కున్నానని తనపై అనేక ఆరోపణలు చేశాడని, కాటసాని అప్పట్లో అధికారంలో ఉన్నా కూడా తనపై చేసిన ఆరోపణలను నిరూపించుకో లేక పోయాడని ఈ సందర్భంగా మంత్రి విష జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు.. జుర్రేరువాగు ఆక్రమణలకు పాల్పడిన వారిని ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు.. బనగానపల్లె లో ప్లాస్టిక్ వాడకం నియంత్రణకు ప్రజలందరూ సహకరిస్తే ఆదర్శవంతంగా తీర్చిదిద్దు తానన్నారు పట్టణంలో ప్లాస్టిక్ వాడ సంచులు వద్దని ప్రజలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు సూచించారు. వ్యర్థ పదార్థాలన్నీ జుర్రేరు వాగులో వేయడం వల్ల వాగు కలుషితమై పోయి దుర్గంధం వస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నట్లే జుర్రేరు వాగును కూడా పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.