లిప్ట్ స్కీమ్‌ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా వైఎస్ జగన్ ఎత్తిపోత పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. 1,040 లిఫ్ట్ స్కీమ్‌లకు గాను 450 లిఫ్ట్ స్కీమ్‌లు మూతపడ్డాయని ఆరోపించారు.. ఇక, తాళ్లూరు లిఫ్ట్ పైపులు సిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే.. పుష్కర మెయిన్ కెనాల్ తాళ్లూరు లిఫ్ట్ బ్లాక్ కాటన్ సాయిల్ కావడం వల్ల బ్రేక్ అవుతోందన్నారు.
బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు రానుంది.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్జీవీ..
కడప జిల్లాలోని కమలాపురం శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్ గదిలో గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. నొప్పితో బాధపడుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గమనించారు.
అరండల్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది.