Avanthi Srinivas To Resign YCP: వైసీపీకి మరో భారీ షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్‌బై..
- వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్..
- వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్‌బై..
- వైఎస్ జగన్ కు రాజీనామా లేఖ పంపిన అవంతి శ్రీనివాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avanthi Srinivas To Resign YCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఘన విజయాన్ని సాధించి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఇక, అప్పటి నుంచి వైసీపీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు.. పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు.. పార్టీ నేతలు.. పార్టీకి గుడ్‌బై చెబుతూ.. కూటమి పార్టీలో చేరుతూనే ఉన్నారు.. ఇప్పుడు వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగిలింది.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజీనామా లేఖ రాశారు అవంతి శ్రీనివాస్..
Read Also: Hajj Yatra: హజ్ యాత్రకు పది వేల మందికీ అవకాశం.. కమిటీ చరిత్రలో ఇదే తొలిసారి..
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు అవంతి శ్రీనివాస్.. 2019 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్.. వైసీపీ హయంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.. ఇక, తాజా ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.. అయితే, అవంతి పార్టీ వీడుతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.. చివరకు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై.. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు.. అయితే, “నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు.. నీ రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుతున్నాను” అంటూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు..
Read Also: Mohan Babu: మోహన్‌బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసు?
ఇక, తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పాటు.. ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌కి.. వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. కాగా, అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.. అయితే, 2014 ఎన్నికలలో టీడీపీ గూటికి చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. వైఎస్ జగన్ కేబినెట్ 1లో పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.. కానీ, జగన్ కేబినెట్ 2లో ఆయన్ని పక్కన బెట్టారు.. ఆ సమయంలో పలు వివాదాల్లో కూడా అవంతి పేరు వినిపించింది.. ఇక, తాజాగా జరిగిన ఎన్నికలలో అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఘోర పరాజయాన్ని మూఠగట్టుకున్నారు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఏకంగా 92,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు.. వైసీపీలో పరిణామాలను జీర్ణించుకోలేక ఇబ్బంది పడ్డారట అవంతి శ్రీనివాస్.. ఈ నేపథ్యంలోనే పార్టీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది..
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!