CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్.. మాటలు కాదు.. 3 నెలల్లో అమలు కనిపించాలి
- టూరిజంపై ఫోకస్ పెట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు..
- కలెక్టర్లు టూరిజంపై వాళ్ల ఆలోచనలు పంపించాలి..
- నిధులు అర్ధవంతంగా ఖర్చుపెట్టాలి..
- ఉపాధి కల్పనకు అత్యధిక అవకాశాలు వచ్చే డిపార్ట్మెంట్ టూరిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్ పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో టూరిజం శాఖపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పీపీపీ మోడ్ లో ఇన్వెస్టర్స్ ముందుకొచ్చారు.. ఈ నెల 17వ తేదీన విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను పిలుస్తున్నాం అన్నారు.. PPPలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు.. అయితే, టూరిజంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కలెక్టర్లు టూరిజంపై వాళ్ల ఆలోచనలు పంపించాలి సూచించారు.. డబ్బులు ఖర్చు పెడుతున్నారే కానీ ఫలితాలుండటం లేదన్న ఆయన.. నిధులు అర్ధవంతంగా ఖర్చుపెట్టాలి.. ఏ ఏ సమావేశాలు కలెక్టర్లు నిర్వహించాలనే అంశంపై ఒక క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు.
Read Also: Allu Arjun: ఢిల్లీకి అల్లు అర్జున్.. తిరుమల శ్రీవారి సేవలో భార్య
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
టూరిజంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కూడా లింక్ చేయాలి.. దేవాలయాల నిధులు కూడా టూరిజం కు లింక్ చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ఏ జిల్లాలో హోటళ్లు, టూరిజం అభివృద్ధి కావాలో వివరాలు కలెక్టర్లు తీసుకురావాలి, మేం అడగటం కాదని వ్యాఖ్యానించారు.. ఉపాధి కల్పనకు అత్యధిక అవకాశాలు వచ్చే డిపార్ట్మెంట్ టూరిజం.. పర్యాటకంతో 20 శాతం అభివృద్ధి రేటు సాధించచ్చు అన్నారు.. కడపలో ఉండే గండికోట చాలా అద్భుతంగా ఉంటుంది.. ప్రపంచంలోనే 10వ సుందర ప్రదేశంగా గండికోటను గుర్తించారని గుర్తుచేశారు. అంతేకాదు.. తిరుపతిలో పర్యాటకులు ఒక రోజు కూడా ఉండటం లేదు.. ప్రతీ జిల్లాలో సరైన మంచి హోటళ్లు లేవు.. అన్ని హోటళ్లు కలుపుకుని 50 వేల రూమ్‌లు ప్రతీ చోటా ఉండేలా చూడాలన్నారు.. టూరిజానికి లా అండ్ ఆర్డర్ చాలా అవసరం.. సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ముఖ్యం అన్నారు సీఎం.. గతంలో ఉన్న లా అండ్ ఆర్డర్ ఉంటే ఎవరూ రారన్న ఆయన.. మాటలు చెప్పడం కాదు.. రాబోయే మూడు నెలల్లో అమలు కనిపించాలని కలెక్టర్లను ఆదేశించారు.. ప్రభుత్వ భవనాలలో, ప్రైవేటు భవనాలలో కో వర్కింగ్ స్పేస్, వర్క్ స్టేషన్లు పరిశీలించండి.. ఓర్వకల్లు, కొప్పర్తి టెండర్లు పిలవండి అని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు