Avanthi Srinivas Resign To YCP: వైసీపీకి షాక్ ఇస్తూ.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. “నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు.. నీ రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుతున్నాను” అంటూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవంతి..
Read Also: Over Sleeping: మహిళలు అతిగా నిద్రపోతున్నారా.. సంతాన సామర్థ్యం తగ్గే అవకాశం..
కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్నారు అవంతి.. సమయం ఇవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రొడ్డెక్కడం సరైనది కాదని హితవు చెప్పారు.. బ్రిటీష్ ప్రభుత్వం తరహాలో తాడేపల్లిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేయమని చెప్పడం కరెక్ట్ కాదన్న ఆయన.. ఎన్నికలు అయిన ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ కేడర్ రొడ్డెక్క మనడం కరెక్ట్ కాదన్నారు.. 2024 ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఒక కేస్ స్టడీగా అభివర్ణించారు.. అభ్యర్థులు కంటే అధినాయకుడిని చూసే జనం ఓట్లు వేశారు.. ఓటమికి ఎవరినో నిందించడం నా ఉద్దేశం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. భీమిలి నియోజకవర్గం కోసం విస్తృతమైన సేవ చేశాను.. జిల్లాలో ఏకైక మంత్రిగా శక్తివంచన లేకుండా పనిచేశాను అని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఐదేళ్ల కోసం ఎంచుకున్న ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకంగా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు పరిమితంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. మరోవైపు.. వైసీపీ రాజీనామా చేయగానే.. తెలుగుదేశం పార్టీ నేతలు అవంతి శ్రీనివాస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.. గతంలో టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేసిన అవంతి.. ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన విషయం విదితమే..