CM Chandrababu: పోలవరంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- మరోసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు..
- గత వైసీపీ ప్రభుత్వం వల్లే.. ఇప్పుడు ఈ పరిస్థితి..
- విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లుగా భావించాం..
- పోలవరం రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మరోసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత వైసీపీ ప్రభుత్వం వల్లే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు… ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లుగా భావించామన్న ఆయన.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి.. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందని వెల్లడించారు.. గొల్లపల్లి, బనకచర్ల కు మూడు దశల్లో అనుసంధానం చేయవచ్చు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాష్ట్రానికి నీటి సమస్య ఉండదు.. చైనాలో ఉండే త్రీ జార్జెస్ డ్యాం కంటే పోలవరం ఎత్తయిన ప్రాజెక్టు అన్నారు.. 2014లో తెలంగాణలోని ఏడు మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానంటే, కేంద్రం ఆ మండలాలను విలీనం చేశారని గుర్తు చేసుకున్నారు.. అప్పట్లో డయాఫ్రం వాల్ ను 460 కోట్లతో బావర్ సంస్థ నిర్మించింది. మొత్తం మీద 72 శాతం పనులు చేశాం.. 30 సార్లు పోలవరం వచ్చాను.. 80 సార్లు వర్చువల్ గా రివ్యూ చేశా.. కానీ, అటువంటి ప్రాజెక్టును వైసీపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.
Read Also: CM Chandrababu : పోలవరం.. రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుంది
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
ఇక, రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం బయటకు పంపిందని మండిపడ్డారు చంద్రబాబు.. అప్పటి కాంట్రాక్టర్ ను మార్చి రాటిఫికేషన్ కు పంపించారు దుర్మార్గులు.. వారి అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యం వలన అంతా నాశనం చేశారు.. 2020లో కాపర్ డ్యాం గ్యాప్‌ను కట్టకపోవడంతో వరద వలన డయాఫ్రం వాల్ దెబ్బతింది.. ఇప్పుడు డీ వాల్ కట్టాలంటే 2400 కోట్లు అదనంగా అవుతుందన్నారు.. 440 కోట్లు అప్పటి డి వాల్ కు అయ్యిందన్న ఆయన.. కేంద్రం పోలవరంకు ఇచ్చిన నిధులను మళ్లించారని ఆరోపించారు.. ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ వర్క్స్ 71.3 శాతం మేం చేస్తే, వారు కేవలం 3.5 శాతం మాత్రమే చేశారని దుయ్యబట్టారు.. అయితే, 12,150 కోట్లను మొదటిదశ గా కేంద్రం మంజూరు చేసింది .. 2150 కోట్లు నిధులను విడుదల చేశారని తెలిపారు.. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం.. పనులను వేగవంతం చేయనున్నాం.. డయాఫ్రం వాల్ , ఈసీఆర్‌ఎఫ్ ఓ డ్యాంలు రెండు ఒకేసారి కట్టవచ్చని అధికారులు చెబుతున్నారని వెల్లడించారు.. వచ్చే ఏడాది జనవరి 2 న డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తాం.. 2026 మార్చి నాటికి పూర్తవుతాయని అధుకారులు అంటున్నారని తెలిపారు చంద్రబాబు..
Read Also: Star Maa : స్టార్ మా సరికొత్త ధారావాహిక “నువ్వుంటే నా జతగా”
అయితే, 2025 డిసెంబర్ నాటికు డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాలి అని అంటున్నాను.. 2027 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణంపూర్తి చేస్తామంటున్నారు.. ఇంకా ముందు పూర్తి చేయాలని అధికారులకు చెప్పాను అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. 2026 నాటికి నీటిని నిల్వ చేసే పరిస్థితి రావాలని అంటున్నాను.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్‌ను 2026 నాటికి పూర్తి చేస్తాం.. ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. నదుల అనుసంధానం జరగాల్సి ఉంది.. ఇతర రాష్ట్రాలతో కొంత వివాదాలు ఉన్నాయి.. వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.. కానీ, మంచి చేసే వారితో పాటు చెడు చేసేవారిని గుర్తుంచుకోవాలి .. విధ్వంసం చేశారు.. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది.. 2019 తరువాత కూడా టీడీపీ అధికారంలో ఉంటే 2021 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు.. ఒక వ్యక్తి మూర్ఖత్వానికి , రాక్షసత్వానికి ప్రాజెక్టు బలయ్యింది.. నాశనం చేసిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను దేవుడు నాకు అప్పగించారు. అయిదేళ్ల కాలంలో ప్రాజెక్టు పనులు చేయకపోవడం వలన 15 వేల కోట్ల వరకు నష్టం వచ్చింది.. ప్రాజెక్టు పూర్తయితే, ఆ లాభం కూడా వచ్చి ఉండేది.. అది కూడా నష్టపోయారని దుయ్యబట్టారు..
Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్
హైదరాబాద్ ఆదాయం వలన సరాసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో మొదట స్థానంలో ఉందన్నారు సీఎం చంద్రబాబు.. కానీ, పోలవరం, అమరావతి రెండు కళ్లను పొడిచేసి, నాశనం చేశారని మండిపడ్డారు.. ప్రజలు వారికి శిక్ష విధించారు.. 11 సీట్లు ఇచ్చారు.. కానీ, నష్టపోయిన దానిని రికవరీచేయలేం అన్నారు.. రాష్ట్రంలో గత ఆరునెలలుగా బూతులు లేవు.. అంతకుముందు ప్రతీ రోజు బూతులు మాట్లాడేవారు.. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే వినిపిస్తున్నాయి. వాటిని కట్టడి చేయగలిగాం కానీ, నష్టాన్ని భర్తీ చేయలేకపోతున్నాం అన్నారు.. పోలవరం ప్రాజెక్టుకు నేను ఇచ్చిన అన్ని డెడ్ లైన్లను పూర్తిచేశాం.. ఒక్కొక్కసారి విధి డెడ్ లైన్ ను మార్చుతుంది.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ను రెండు దశల్లో పూర్తి చేస్తాం అన్నారు.. మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తులో ముంపుకు గురయ్యే నిర్వాసితులకు, రెండవ దశలో 45.75మీటర్ల ఎత్తులో ముంపుకు గురయ్యే నిర్వాసితులకు పూర్తి చేస్తాం అని ఈ సందర్భంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..