Minister Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మొదట పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆయన.. తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్‌ను సందర్శించారు. ఆ తర్వాత విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ అని అన్నారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలన్నారు. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని కోరారు. ఇక, మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే భోజనం తమకు పౌష్టిక విలువలు అందిస్తుందని, ఉన్నతమైన విద్య చదువుకోవడానికి ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు విద్యార్ధులు.. విద్యార్ధులతో కలిసి మంత్రి లోకేష్ భోజనం చేశారు… మధ్యాహ్న భోజనం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు..
Read Also: Nagavamshi : “డాకు మహారాజ్” నిర్మాత నాగవంశీ స్పెషల్ రిక్వెస్ట్
మరోవైపు, ఇక్కడనున్న జూనియర్ కళాశాల బయట సీసీ కెమెరాలు పెట్టిస్తాను అన్నారు మంత్రి లోకేష్.. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల మధ్య ఉన్న తేడాలు లేకుండా చేస్తాం.. ప్రైవేటు విద్యలో వచ్చిన అభివృద్ధిని ప్రభుత్వ కాలేజీలు కూడా తీసుకొస్తాం అన్నారు.. కళాశాలలకు ప్రత్యేకంగా ఒకే విధంగా ఉండేలా రంగులు వేయాలని చూస్తున్నాం.. దేనికైనా ఫిట్నెస్ కంటే సంకల్పం కావాలి అన్నారు.. సింగపూర్ ప్రధానిగా పని చేసిన లీక్వానీ, భారత ప్రధానిగా పని చేసిన వాజ్ పేయి, మా నాన్న చంద్రబాబు.. నాకు ఆదర్శం అని ఈ సందర్భంగా వెల్లడించారు నారా లోకేష్..