CM Chandrababu: తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది.. దీంతో, ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలోని హెలిప్యాడ్ దగ్గర సీఎం చంద్రబాబుకు వీడ్కోలు పలికారు టీడీపీ నేతలు.. అధికారులు, ఇక, ద్రావిడ యూనవర్సిటీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు.. బెంగళూరు నుంచి విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికి.. ప్రధాని పపర్యటనలో పాల్గొననున్న విషయం విదితమే..
Read Also: Hyderabad Metro : మెట్రో స్టేషన్లలో సంక్రాంతి సంబరాలు.. డ్యాన్సులు, పాటలతో జోష్..!
ఇక, సొంత నియోజకవర్గం కుప్పం నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చే అర్జీలను ఇక నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘జన నాయకుడు’ పేరుతో ఓ పోర్టల్‌ను సిద్ధం చేశారు. ఆ పైలెట్ ప్రాజక్టును కుప్పం నుంచే ప్రారంభించారు.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జననాయకుడు పరిష్కార వేదిక పోర్టల్ ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నారు.. ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి.. సంబంధిత అధికారులను రిపర్ చేయడం.. వారి ద్వారా సమస్యలను పరిష్కరించడం అనే దానిపై కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం..