ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు..
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని దానిపైనే రాసి ఉంటుంది.. అయినా.. కొందరు దానికి బానిసగా మారిపోతారు.. కొందరు సిగరెట్లు, మరికొందరు బీడీలు.. ఇంకా కొందరు చుట్టలు ఇలా.. లాగిస్తుంటారు.. వీటితో అనారోగ్య సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచినవాళ్లు ఎందరో ఉంటారు.. కానీ, ధూమపానానికి బానిసైన ఓవృద్ధుడు చివరకు తను కాలుస్తున్న సిగరెట్ మంచానికి అంటుకొని అగ్నిప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.. అనారోగ్యంతో ఓ వృద్ధుడు కన్నుమూస్తే.. మద్యం సేవించి కుమారుడు, అతడి బామ్మర్ది గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది..
శ్రీశైలం సమీపంలో మరో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. శ్రీశైలం సమీపంలోని శిఖరం నుండి ఇష్టకామేశ్వరి గేటుకు వెళ్లే మార్గం మధ్య దారిలో నల్లమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి భక్తులకు చెందిన ఓ ఎలక్ట్రికల్ వాహనం చెట్లకు ఢీ కొట్టింది..
సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నాయి పల్లెలు.. ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్‌వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్‌వెజ్‌ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.