Alia-Alpha : ఆలియా భట్ ‘ఆల్ఫా’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మొదటిసారిగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ఆలియా భట్‌తో పాటు శర్వరీ బాగ్ పవర్‌ఫుల్ స్పై ఏజెంట్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల అవుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. దీంతో ఆలియా అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ, తాజాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చి అందరినీ ఊరట కలిగించింది.
Also Read : Mrunal-Danush : “చెన్నై వాలా” అంటే ధనుషేనా? రిపోర్టర్ల ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుల మొగ్గ!
Also Read
‘ఆల్ఫా’ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ స్థాయిలో థియేటర్లలోనే విడుదల అవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలనే ఉద్దేశంతోనే విడుదల తేదీని ఏప్రిల్ 17, 2026కి వాయిదా వేశారు. ప్రస్తుతం ముంబైలోని YRF స్టూడియోలో ఆలియా, శర్వరీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ పాల్గొంటున్న చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. స్పై యూనివర్స్‌లో వస్తున్న మొదటి ఫీమేల్ లీడ్ యాక్షన్ సినిమా కావడంతో, దీనిని బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నామని, ఓటీటీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!