ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనా ఓ సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆధ్వర్యంలో పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేనలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనసేనాలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి పలువురు క్షేత్రస్థాయి నాయకులు జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు.
జనసేన కేంద్ర కార్యాలయంలో నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగబాబు సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్నాం కనుక నాకే ఏదైనా చేసుకోవచ్చు.. అనే ఆలోచనతో ఉండొద్దని, మీతో పాటూ మిమ్మల్ని నమ్మిన వారికి ఉపయోగపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొత్తగా పార్టీలో చేరిన వారికి సూచించారు. వైసీపీ నుంచీ జనసేనలోకి వచ్చిన వారు స్వార్ధాన్ని వదిలేయాలని అన్నారు. ప్రజల బాగోగులు చూడటం ప్రతీ జనసైనికుడి కర్తవ్యం అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన పాఠం అదేనని ఆయన అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నందున ఎంత వరకూ మంచి చేయగలం అని మాత్రమే ఆలోచించండడని పార్టీలో చేరిన వారికి సూచించారు. పార్టీలో చేరిన నాయకులు పార్టీకి తగినట్టుగా పని చేయడం, క్రమశిక్షణతో ఉండటం అవసరం అని తెలిపారు. చేరికల కార్యక్రంమలో ఎమ్ఎల్సీ హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.