YS Jagan: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన..
- తక్కువ ఆదాయం వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభారం..
- కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తక్కువ ఆదాయ వృద్ది, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు. రోజు రోజుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారింది.. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా పరిస్థితి ఉంది.. టీడీపీ కూటమి ప్రభుత్వ పని తీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే.. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు.. కానీ కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది.
Read Also: Women marriage With AI: మగాళ్లపై విరక్తి చెందిన మహిళ.. ఓదార్పు కోసం ఏఐతో పెళ్లి..
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారు? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది.. కానీ, ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయి.. సంపద సృష్టి లేకపోవటంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది.. కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్దిలో వేగంగా పరుగులు పెడుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు? అని జగన్ అడిగారు.
𝙇𝙤𝙬 𝙍𝙚𝙫𝙚𝙣𝙪𝙚 𝙂𝙧𝙤𝙬𝙩𝙝, 𝙇𝙤𝙬 𝘾𝙖𝙥𝙚𝙭 𝙖𝙣𝙙 𝙍𝙞𝙨𝙞𝙣𝙜 𝘿𝙚𝙗𝙩 – 𝙏𝙝𝙚 𝙑𝙞𝙨𝙞𝙤𝙣 𝙤𝙛 @ncbn 𝙂𝙖𝙧𝙪
The figures released by the CAG for first half of FY 2025-26 reveal a very discouraging growth of State Government revenues. This is quite contrary to the… pic.twitter.com/aQSOlWz7uL
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 16, 2025
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!