Major Accident: కీసర టోల్ గేట్ వద్ద దాసరి ట్రావెల్స్ బస్సులో మంటలు..
- కీసర టోల్ గేట్ వద్ద తప్పిన పెను ప్రమాదం..
- ఎయిర్ పైప్ లీక్ అవ్వడంతో టైర్లు హీట్ ఎక్కి పొగలు..
- టైర్లలో నుంచి పొగలు రావడం గమనించి బస్సును నిలిపివేసిన టోల్ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Major Accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్ గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. దాసరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగగా.. టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తతతో పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్న ఈ బస్సు కీసర టోల్‌గేట్‌ను దాటే సమయంలో, బస్సు టైర్ల దగ్గర పొగలు రావడాన్ని టోల్ సిబ్బంది ముందుగా గుర్తించారు. ఎయిర్ పైప్ లీక్ కావడంతో టైర్లు హీట్ ఎక్కి, మంటలు అంటుకునే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. వెంటనే బస్సును నిలిపివేసి డ్రైవర్‌కు టోల్ సిబ్బంది సమాచారం ఇచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించారు.
Read Also: రాజస్థాన్ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి
Also Read
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
కాగా, ఈ ఘటన సమయంలో టోల్‌గేట్ దగ్గర డ్యూటీలో ఉన్న కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్, పోలీస్ వాహనంలో నిద్రపోతూ ఉండటం స్థానికంగా చర్చగా మారింది. ప్రమాదం జరిగినట్టు తెలిసినా, ఎస్ఐ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. అయితే, బస్సులో ప్రయాణిస్తున్న వారిని మరో బస్సులోకి తరలించారు. అప్రమత్తమైన టోల్‌గేట్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుని ప్రాణాపాయాన్ని తప్పించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక, బస్సు టోల్ గేట్ వద్ద ఆగి ఉండకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం జరిగేది అని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!