ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై BACలో నిర్ణయం తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(ఫిబ్రవరి 23) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459…
రేపటి నుంచి(ఫిబ్రవరి 24) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ లను జారీ…
సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్-2 అంధ విద్యార్థిని సంజనకు అన్యాయం జరిగింది. గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వచ్చిన అంధ విద్యార్థిని సంజన.. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు పవన్ కల్యాణ్.. ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు..
పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ.... గత ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని కూటమి పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఇక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి తన సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నారాయన. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని ఎన్నికలకు ముందు స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. అటు వర్మకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కూడా హామీ ఇచ్చేశారు. అయితే రాష్ట్రంలో…
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? లేదా? అనే గందరగోళ పరిస్థితిలో ఉన్న అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. రేపు గ్రూప్- 2 ఉద్యోగాల నియామకం కోసం మెయిన్స్ పరీక్ష యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ.. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుందని.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది..
గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..! ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన…