నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు.. మహిళలతో ముఖాముఖి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు (మార్చ్ 8న) మార్కాపురం వెళ్లనున్నారు. ఇక, 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని తొలుత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 11.15 గంటల వరకు అధికారులతో భేటీ కానున్నారు. తర్వాత సభాప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయనున్నారు. విశ్రాంతి అనంతరం సుమారు గంటన్నర పాటు మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక, పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు సీఎం. తిరిగి 4.42 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.
నేడు పోలీస్ కస్టడీకి పోసాని కృష్ణ మురళి..
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ ఇచ్చింది నరసరావుపేట కోర్టు.. పోసానిని ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి.. పోసానిని రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కోరితే.. న్యాయవాది సమక్షంలో అతడ్ని విచారణ చేయాలంటూ పోలీసుకు న్యాయస్థానం సూచించింది.
15వ రోజుకు చేరిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. పరిహారం విషయంలో కీలక ప్రకటన..!
15వ రోజుకు చేరిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. పరిహారం విషయంలో కీలక ప్రకటన..!ఎస్ఎల్‌బీసీ (SLBC)టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 15వ రోజుకు చేరింది. జీపీఆర్ (GPR), క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, TBM మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. నేడు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలంలో ఉండి సమీక్ష నిర్వహించారు. మరోసారి టన్నెల్ వద్దకు వెళ్లి టన్నెల్‌లో రెస్క్యూను పరిశీలించనున్నారు. మరోవైపు.. మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2k, 5k రన్..
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు ఆధ్వర్యంలో రన్ ఫర్ యాక్షన్ 2k & 5k రన్-2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారు.. మహిళలు అంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా చూస్తున్నారని అన్నారు. పురుషులు.. మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని ఆమె పేర్కొన్నారు. మహిళలు అంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి.. ఆపదలో ఉన్న మహిళలు, అమ్మాయిలను ఆదుకోవాలని చెప్పారు.
ఫాల్కన్ స్కామ్ కేసు.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ సీజ్
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్‌ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ స్కాం కేసులో నిందితులు ఇదే ఫ్లైట్‌లో దుబాయ్ కి పారిపోయారు. 15 రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయి తిరిగి ఫ్లైట్‌ను హైదరాబాద్‌కు పంపారు నిందితులు.. అర్ధరాత్రి సమయంలో ఈ చార్టర్డ్ ఫ్లైట్ శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. విమానం రాకను ముందుగానే పసిగట్టిన ఈడీ అధికారులు.. ఫ్లైట్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలిస్తామంటూ రూ.1700 కోట్లు వసూల్లు చేసింది ఫాల్కన్ కంపెనీ. పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతామంటూ ప్రచారం చేసింది. ఇది నమ్మిన జనాలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతోనే కీలక సూత్రధారి అమర్‌దీప్ కుమార్ చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేశాడు.
మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేస్తుండగా బాలుడు సైక్లింగ్.. చితకబాదిన పోలీస్
ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించారు. అయితే ముందుగా గురువారం సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేసింది. ఆ సమయంలో హఠాత్తుగా ఓ బాలుడు(17) సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. దీన్ని గమనించిన పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ వెంటనే సైక్లింగ్ చేస్తున్న బాలుడిని అడ్డుకుని చితకబాదాడు. తల మీద, ముఖంపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం సూరత్‌లోని రతన్ చౌక్ దగ్గర మోడీ కాన్వాయ్ రిహార్సల్ జరుగుతున్నాయి. 17 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుతున్నాడు. అక్కడే ఉన్న పోలీస్ అధికారి బీఎస్ గధ్వి.. బాలుడిని నిలువరించి చెంపదెబ్బకొట్టాడు. పిడుగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌కు తరలించి.. రాత్రి వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. బిడ్డ ఏమయ్యాడో తెలియక.. తల్లిదండ్రులు అల్లాడిపోయారు. రాత్రి 9:30 గంటలకు బాలుడు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం చెప్పడంతో పోలీసుల తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏదైనా తప్పు చేస్తే కౌన్సెలింగ్ ఇచ్చో.. లేదంటే మందలించి పంపించాలి కానీ.. రాత్రి వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టడమేంటి? అని నిలదీశారు.
అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరో హీరో ఫిక్స్.?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నప్పటికీ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఇటీవల బన్నీ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టుగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన కోలీవుడ్ హీరో అని ప్రచారం జరిగింది. కానీ ఆ హీరో ఎవరనే విషయం బయటికి రాలేదు. అయితే లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ ను ఇటీవల అట్లీ కలిసి స్టోరీ వినిపించగా అందుకు శివ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌లో పాటు ఇటు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్. ఇటీవల అమరన్ సినిమాతో అటు కోలీవుడ్ పాటు టాలీవుడ్ లోను బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు అట్లీ మాత్రం బన్నీతో భారీ ఎత్తున సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. జవాన్‌తో అట్లీ వెయ్యి కోట్లు కొల్లగొట్టగా పుష్ప 2తో అల్లు అర్జున్ ఏకంగా రూ. 1871 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ కాంబోకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
ప్రేమించే వ్యక్తిని జాగ్రత్తగా ఎంచుకోండి..
నార్త్‌కు చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ఆడియన్స్‌కు ఎంతగానో దగ్గరైంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి కెరీర్‌ను బలంగా నిలబెట్టుకుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న, ఇప్పటికీ అదే స్టార్ డమ్ తో విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా తన కెరీర్‌ను ఎక్కడ కూడా డౌన్ కాకుండా ప్రతి ఒక పాత్ర చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక స్కిన్ షో, బోల్డ్ సీన్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా ఈ బ్యూటీ, మరింత పాపులారిటి దక్కించుకుంది. ఇక ఈ అమ్మడు కెరీర్ విషయం పక్కన పెడితే.. నటుడు విజయ్ వర్మ తో తమన్నా దాదాపు రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాము ప్రేమలో ఉన్నట్లు మీడియాకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు.