* నేడు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. భారత్ తో తలపడబోతున్న న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్..
* నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికపై అధిష్టానంతో కసరత్తు.. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి..
* నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఉత్తమ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడనున్న కేసీ వేణుగోపాల్..
* నేడు ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక.. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్.. ఇవాళ టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బీజేపీ అభ్యర్థుల విషయంలో రాని స్పష్టత..
* నేడు SLBC టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. టన్నెల్ లో ఎండ్ పాయింట్ లో కీలక స్పాట్స్ గుర్తింపు.. కీలకమైన స్పాట్స్ లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు..
* నేడు రెండోరోజు పోసాని కృష్ణ మురళి పోలీస్ కస్టడీ.. విచారించనున్న పోలీసులు..
* నేటి నుంచి తిరుమలలో 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. మొదటి రోజు శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న శ్రీవారు.. నేటి నుంచి 5 రోజుల పాటు సహస్రదీపాలంకరణ రద్దు..