Chelluboyina Venu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 14 లక్షలు కోట్ల అప్పులపాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. శాసన సభలో 6 లక్షల 40వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది.. అప్పుల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అధికార కోసం అబద్ధాలు ఎంచుకున్న నాయకుడు చంద్రబాబు.. ప్లీజ్ రియంబర్స్మెంట్ చేస్తానని విద్యార్థులను మభ్యపెడుతున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష 30 వేల కోట్లు అప్పులు చేశారు.. రాష్ట్రానికి అప్పులు పుట్టవని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇన్ని అప్పులు ఎలా చేశారు.. ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెల్లుబోయిన వేణు చెప్పుకొచ్చారు.
Read Also: Ravichandran Ashwin: టాస్ గెలవకున్నా, ఇండియా మ్యాచ్ గెలవగలదు: అశ్విన్
ఇక, ప్రజా జీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది వైసీపీ అని చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన పథకాలకు పేర్లు మార్చుతున్నారు.. జగన్ ముఖ్యమంత్రిగా ప్రచారం తక్కువ పని ఎక్కువ చేశారు అని తెలిపారు. కానీ, చంద్రబాబు హయాంలో ప్రచారం ఎక్కువ, పని తక్కువ అని ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన కలెక్టరేట్ ఎదుట ఫీజు రీయింబర్స్మెంట్ పై ధర్నా చేస్తామన్నారు. వైసీపీ శ్రేణులు విద్యార్థులు ఈ ఆందోళన విజయవంతం చేయండి అని చెల్లుబోయిన వేణు గోపాల్ కష్ణ వెల్లడించారు.