మార్చి 19వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.. మొత్తంగా 15 వర్కింగ్ డేస్ లో సమావేశాలు జరగనున్నాయి.. అవసరం అయితే మరో రెండు రోజులు పొడిగించాలని బీఏసీలో నేతలు అభిప్రాయపడ్డారు.. అయితే, వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి..
కూటమి సర్కార్కు సవాల్ విసిరారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. పులివెందుల ఉప ఎన్నిక కాదు.. సూపర్ సిక్స్ పథకాలు రెఫరండంతో మంగళగిరి, పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్ విసిరారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీకి వెళ్లినా.. వెళ్లకున్నా.. ప్రజా సమస్యల పై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు..
మొదటి నుంచి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తమ నేత ప్రజా సమస్యలపై మాట్లాడాలని అడిగామన్నారు. అందరూ సభ్యుల లాగే అసెంబ్లీలో అవకాశం ఇస్తే తమ నేత వైఎస్ జగన్ కు కూడా కేవలం ఒకటి, రెండు నిమిషాల సమయం మాత్రమే ఇస్తారన్నారు.
అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షం అవసరం అన్నారు బొత్స.. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కలని చూస్తున్నారని మండిపడ్డారు.. సభలో ఉన్నది రెండే పక్షాలు అని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? అని నిలదీశారు.. మిర్చి రైతుల ఇబ్బందులు ప్రభుత్వ పట్టించుకోవటం లేదు. మా నేత జగన్ వెళ్ళే వరకు మిర్చి రైతుల ఇబ్బందులు పట్టించుకోలేదన్నారు..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను అసెంబ్లీ ముందు పెట్టారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు పాల్గొన్నారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది.