AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ మరియు పీఎం కిసాన్ పథకాల రెండో విడత నిధుల విడుదలకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులుతో సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి మార్గదర్శకాలు జారీ చేశారు..
Read Also: Akkineni Nagarjuna : తమిళనాడు పోలీసులు చేయలేనిది తెలంగాణా పోలీసులు చేసి చూపించారు.. హ్యాట్సఫ్
ఈ నెల 19వ తేదీన, అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనున్నారు. అదే రోజున పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక, సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. చనిపోయిన రైతుల వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.. NPCAలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.. అర్హత ఉన్న రైతులు సులభంగా రిజిస్టర్ చేసుకునేలా ఆన్‌లైన్ వ్యవస్థను సింప్లిఫై చేయాలని సూచించారు..
ఈ విడతలో మొత్తం లబ్ధిదారులు సంఖ్య 46,62,904 మంది రైతులుగా ఉంది.. రైతులకు జమయ్యే మొత్తం రూ.7,000.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000.. కేంద్ర ప్రభుత్వం (PM-Kisan) రూ.2,000 చొప్పున జమ చేయనున్నారు.. రెండు పథకాల కింద విడుదలయ్యే మొత్తం నిధులు రూ.3,077.77 కోట్లు.. ఇక, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రైతు బలం. అర్హులైన ప్రతి రైతు కు పథకం లబ్ధి అందేలా అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలి.. అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు.