గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి - బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని... తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు లిక్కర్ కేసు హాట్‌టాపిక్‌గా సాగుతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్.. ఓవైపు కీలకంగా భావిస్తోన్న రాజ్ కేసిరెడ్డి విచారణపై దృష్టి పెడుతూనే.. మరోవైపు.. అరెస్ట్‌లపై ఫోకస్ పెట్టింది.. ఏపీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా రాజ్ కేసిరెడ్డి కస్టడీ కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.. కేసు విచారణలో భాగంగా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది సిట్..
ఆంధ్రప్రదేశ్ లో ఫిన్ టెక్ ప్రగతి ప్రయాణం భూముల చుట్టూ తిరుగుతోంది. విశాఖలో అత్యంత ఖరీదైన భూములను 99పైసల లీజుకు కేటాయించడం తీవ్ర చర్చ నీయాంశంగా మారుతోంది. ఐటీ అభివృద్ధి, ఏకో సిస్టమ్ కోసం ప్రభుత్వం సంకల్పంకు ఈ నిర్ణయం ఉదాహరణగా అధికారపార్టీ సమర్ధించుకుంటుంటే.. భూ పందేరాల వెనుక రహస్య అజెండా ఉందని ప్రతిపక్షం అనుమానం వ్యక్తం చేస్తోంది.
పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “ఉగ్రవాదుల దాడిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఖండించాలి.. దేశంలో ఎన్ని మతాలు, కులాలు ఉన్నా కలిసి వెళ్లే సంస్కృతి మన పెద్దలు నేర్పారు.. Also Read:Pahalgam terror attack: ఉగ్రవాదుల…
పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సత్తా చాటింది. విద్యార్థిని పావని చంద్రిక కారంపూడి మండలం ఒప్పిచర్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి 598 మార్కులు సాధించింది. విద్యార్థిని పావని చంద్రికని జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థిని పావని చంద్రిక, ఆమె తల్లిదండ్రులు, పాఠశాల HM లను పిలిచి సన్మానించి స్వీట్లు తినిపించారు జిల్లా డీఈఓ చంద్రకళ. Also Read:CM Chandrababu: వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు…
Chelluboyina Venu: తన మనుషులకు లబ్ధి చేకూర్చటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ పాలసీనే మార్చారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. దీని వల్ల సంవత్సరానికి 1100 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో 5500 కోట్లు ఖజానాకు నష్ట వచ్చిందని తెలిపారు.
పదో తరగతి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. టెన్త్ లో చూపిన ప్రతిభ పై చదువులకు బాటలు వేసి గోల్డెన్ ఫ్యూచర్ ను అందిస్తుంది. అందుకే తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు టెన్త్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా 600కు 600 మార్కులు సాధించి ఔరా అనిపించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు…
Margani Bharat: చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్పిలరీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నాలుగైదు డిస్టిలరీలకు అత్యధికంగా ఆర్డర్లు ఇచ్చేవారని ఆరోపించారు.
AP 10th Results 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది.
2019-24 వైసీపీ ప్రభుత్వంలో 32 వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 35 వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించింది.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు అని ఆరోపించారు. మహేంద్ర తనయ ప్రాజెక్ట్ లను నిర్వీర్యం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్, రెవెన్యూ మంత్రి, పశుసంవర్ధక మంత్రి ఉన్నా, ఈ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యం అంటూ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.