శ్రీవారి దర్శన టిక్కెట్లుకు డిమాండ్ కొనసాగుతుంది.. జులై నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ.. ఆర్జిత సేవా టిక్కెట్లును గంటా నాలుగు నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేశారు.. ఇక, అంగప్రదక్షణ టికెట్లను 2 నిమిషాలలో వ్యవధిలో బుక్ చేసుకున్నారు.. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు 9 నిమిషాల వ్యవధిలోనే పూర్తి కాగా.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా కేవలం 58 నిముషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో కొనుగోలు…
పంచాయితీ డబ్బులు పంచాయితీకే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవానికి హాజరయ్యారు పవన్.. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కాబోతోఉన్నారు.. హస్తిన వెళ్లనున్న సీఎం చంద్రబాబు దంపతులు. రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానితో భేటీకాబోతున్నారు.. మే 2వ తేదీన ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న విషయం విదితే.
సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ.. అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి.. అప్పు.. సంపద పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలో మద్దతు ఉంది అని చెప్పుకుంటున్నారు..
కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.. కొప్పర్తి పారిశ్రామిక వాడను పరిశీలించారు పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎం.ఎస్.ఎం పార్క్‌పై అపోహలు వద్దు.. జిల్లాలోని ఏర్పాటు చేస్తాం అని స్పష్టం చేశారు.. ఐటీ పార్క్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 ఎకరాలు ఐటీ పార్క్ కోసం స్థల…
పెళ్లికి వచ్చాడు.. అందరితో పాటు భోజనం చేశాడు.. అయితే, అతడి టార్గెట్ మాత్రం వేరు..పెళ్లిలో కలియతిరుగుతూనే అంతా గమనించసాగాడు.. చివరకు చదివింపుల సొమ్ము దాచిన బ్యాగ్‌తో ఉడాయించాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉడతా వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఉడతా వెంకట్రావు తనయుడు రమేష్ పెళ్లికి ఆహ్వానించిన వారంతా వచ్చారు. బంధువులు, స్నేహితులు రాకతో కల్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధువరూలను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్తున్నారు. అటు తర్వాత ఉడతా…
రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ఎవ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు నారాయణ.. వాణిజ్య వ్యాపార లావాదేవీలు జరగాలంటే భూమి అవసరం.. పెద్ద పెద్ద కంపెనీలు.. పరిశ్రమలు రావాలి.. అందుకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో రావాలి.. ఇందుకోసం అదనపు భూమి అవసరం.. కానీ, భూ సేకరణ చేస్తే రైతులకు నష్టం జరుగుతుందన్నారు..
గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి - బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని... తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.