CM Chandrababu: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ మేరకు ఉగ్రవాదులది పిరికిపంద చర్య, ఈ హింసను ఖండిస్తున్నామన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం.. దేశ భద్రతను కాపాడే విషయంలో మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని, క్యూబిక్ మీటర్ ఒక్క రూపాయుకే, రైతులకు సరఫరా చేసేలా అనుమతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు.
Kolleru: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని “కేంద్ర సాధికార కమిటీ”కి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ప్రైవేటు మత్స్యకారులు సంఘం ఆశ్రయించిన విషయం విధితమే.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మే 2వ తేదీన ఏపి రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జరగనుంది.. ఈ శంఖుస్థాపన చేసేందుకు రావాలని ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు.
Kesineni Chinni vs Kesineni Nani: విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ ముదురుతుంది. మాజీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ ఎంపీ చిన్ని లీగల్ నోటీసు పంపించారు. రూ. 100 కోట్లు నష్ట పరిహారం కోరుతూ ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. కాగా, కేశినేని చిన్ని పంపిన లీగల్ నోటీసులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ఎంపీ కేశినేని నాని ఓ పోస్ట్ పెట్టారు.
Perni Nani: కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు..
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం అని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.
పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో రెండు రోజులపాటు జరగనున్న ఏఐ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యమని స్పష్టం చేశారు.. టెక్నాలజీ వినియోగంతో రియల్‌టైమ్‌లో సేవల డెలివరీ చేయవచ్చు అని.. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఇస్తాం.. త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
తనపై సస్పెన్షన్ వేటు విషయంపై తొలిసారి స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. నా ఈ స్థాయి కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డియే అంటూ ఓ వీడియో విడుదల చేశారు దువ్వాడ శ్రీనివాస్.. హోదా , గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న ఆయన.. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసాను.. పార్టీ గొంతే మాట్లాడాను.. ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డాను.. ఎంతో కష్టపడి పనిచేసిన నాకు, అకారణంగా వ్యక్తిగత…