* నేడు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ – పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్
* హైదరాబాద్: నేటి నుంచి 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు.. మానవీయ కోణంలో భూసమస్యలను పరిష్కరించాలి.. ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో అన్నీ రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ తో కూడిన బృందం.. ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారం
* విజయవాడ: నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్.. కేసులో ఏడుగురు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్న జైలు అధికారులు
* ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన.. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్..
* నేడు శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్న సీడబ్ల్యూపీ పూణె నిపుణుల బృందం.. జలాశయం భద్రత, ఫ్లంజ్ పూల్‌ను పరిశీలన.. రేపు విశాఖకు చెందిన ఓ ప్రవేట్ సంస్థతో అత్యాధునిక కెమెరాలతో అండర్ గ్రౌండ్ వాటర్ వీడియోస్ చిత్రీకరణ
* కర్నూలు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు రాక్ గార్డెన్ లో యోగా.. పాల్గొననున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు తగ్గిన వరద ప్రవాహం.. 1 గేటు ఎత్తివేత.. ఇన్ ఫ్లో 2,248 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో. 2,407 క్యూసెక్కులు..
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు.. ఇన్ ఫ్లో : 29,947 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : నిల్
* తిరుమల: 29 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లోని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,418 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 34,900 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు
* హైదరాబాద్‌లో నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. హిమాయత్ నగర్ TTDలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ, వెంగల్ రావు నగర్ డివిజన్ విజిట్ చేయనున్నారు.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ, శ్రీనగర్ కాలనీ, నాగార్జున నగర్ విజిట్ చేయనున్న కిషన్‌రెడ్డి