AP Crime: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన చోటు చేసుకున్న ఘటన రాజానగరం గైట్ కాలేజీల్లో కలకలం సృష్టించింది.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) కాలేజీ హాస్టల్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం నెల్లూరు జిల్లా, నరసాపురం మండలం, గుడ్లూరు గ్రామం.. అయితే, ఫస్ట్ సెమిస్టర్ లో నాలుగు పరీక్షలలో ఫెయిల్ అవ్వడంతో ప్రగతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఆవేదనకు గురైన ఆ విద్యార్థిని.. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Usha Vance: భారత్ టూర్ విశేషాలను నెమరువేసుకున్న ఉషా వాన్స్