AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు, 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
Read Also: Virat Kohli: ఈ విజయం ఆర్సీబి అభిమానులకు అంకితం.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..!
ఇక, వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకువచ్చిన ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పనపై చర్చించి.. ఆ ప్రతిపాదలనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు, ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్..