కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీరు ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మాజీ మంత్రి విడదల రజిని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనపై మీడియాతో మాట్లాడిన ఆమె.. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.
సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. విద్యార్థులను అభినందించారు.
కడపలో మేయర్ సురేష్ బాబు వర్సెస్ కమిషనర్గా మారిపోయింది వ్యవహారం.. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఉత్కంఠభహితంగా సాగింది.. ఉదయం నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అక్కడ నెలకొంది... మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి కల్పించాలని సజావుగా నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలంటూ కడప మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. అయితే, ఇదే సమయంలో.. పోలవరాన్ని భారీ టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 15 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటుపై దృష్టి సారించారు అధికారులు.. 255 కోట్ల రూపాయలతో రిసార్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకుల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.. రాగి రేకుల్లో హాలీ తోకచుక్కకు సంబంధించిన శిలాశాసనం గుర్తించారు.. 1456లో విజయనగరరాజు మల్లికార్జున పాలనకు చెందిన సంస్కృత, దేవనాగరి లిపిలో ఈ శాసనం ఉందని అధికారులు తేల్చారు
టీటీడీపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది టీటీడీ.. అవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది.. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయం. శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో…
గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మాట్లాడుతూ.. మన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసేసినా.. నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని హెచ్చరించారు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించారు. కానీ, మనం మాత్రం.. కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు..
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.. ఇప్పటికే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్ట్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. విశాఖ ఎయిర్ పోర్ట్కు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు.