పెద్దలను ఒప్పించి లేదా ఎదిరించి అయినా సరే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తుంటారు. ఇదే విధంగా ఓ యువతి తను ప్రేమించిన యువకుడిని పెళ్లాడింది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తండ్రి ఎవరూ ఊహించని పనిచేశాడు. ప్రేమ పెళ్లి తర్వాత కూతురు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి తన కుమార్తెకు పుట్టిన మగ శిశువును కన్న తల్లికి తెలియకుండా వేరొకరికి దత్తత ఇచ్చాడు. అయితే…
నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Tirumala: తిరుమలలోని జీఎన్సీ టోల్ గెట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఘట్ రోడ్డులో ప్రయాణం అనంతరం తిరుమలకు చేరుకోగానే దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. భక్తులు కారు ఆపి భయటకు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుక మందమంటూ చంద్రబాబు గర్వంగా, అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లాస్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. బాబుకు మోసం తప్ప చిత్తశుద్ధి తెలియదని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఏపీలో విద్యా వ్యవస్థపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని విమర్శించారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
CM Chandrababu: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పేరుతో రాజకీయాలు మర్చిపోయాం.. దీంతో మనపై దుష్ప్రచారం చేశారు.. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఏమి చేశామో చెప్పాలి అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు వివరించాలి.. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
Palnadu: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
CM Chandrababu: ఈరోజు ఉదయం 11గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.